Header Ads

Header ADS

ఇక్ష్వాకులు చాప్టర్ కి సంబందించిన ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు

1 ) ఇక్ష్వాకుల రాజధాని ఏది ?

       Ans: విజయపురి 

2) ఎవరి పరిపాలనా కాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధమతం

గొప్ప పోషణను పొందింది?

Ans: వీరపురుషదత్తుడు 

3) ఇక్ష్వాకులు స్వతస్సిద్ధంగా తెలుగువారేనని వాదించినదెవరు

Ans: కాల్డ్ వెల్

4) ఉపాసిక బోధిశ్రీ ఈయన పాలనాకాలంలో బౌద్ధమత

ప్రచారానికి విశిష్ట సేవలందించినది?

Ans: వీరపురుషదత్తుడు

5 హారీతి వీరి కులదేవత

Ans: ఇక్ష్వాకులు 





6 వ్యవసాయాభివృద్ధి లో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయటానికి

 కృషి చేసిన ఇక్ష్వాకు రాజు ఎవరు ?

    Ans: శ్రీ చాంతమూల 

7 ఏ ఇక్ష్వాకు చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డాడు ?

Ans: వీరపురుషదత్తుడు 

8 . క్రింది వాటిలో రుద్రపురుషదత్తుడు వేసిన శాసనం ఏది ?

Ans : గురజాల శాసనము 

9. ఏ ప్రాంతంలోని శాసనం, చక్రవర్తి వివిధ వర్గాలకు,

సంస్థలకు ఇచ్చిన బహుళదానాలను పేర్కొన్నది?

Ans: అల్లూరు

10. ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి

       నేడు ఏ విధంగా పిలవబడుతుంది ?

  Ans: శ్రీ పర్వతం లేదా నాగార్జున కొండ ప్రాంతం


11.  ఇక్ష్వాకుల జన్మస్థలం ఉత్తర భారతదేశం అని రాప్సన్, బూలర్

పేర్కొనగా, కన్నడ ప్రాంతం అని పేర్కొన్నవారు? 

Ans : ఓగెల్

12 వీరపురుషదత్తుడి యొక్క ఏ శాసనం ప్రకారం ఇక్ష్వాకులు

శాతవాహనుల యొక్క సామంతులు?

Ans -అల్లూరి శాసనం

 13. ఇక్ష్వాకుల జన్మస్థలానికి సంబంధించి కె.గోపాలాచారి,

         కాల్డ్వెల్లు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏవి?

Ans- తమిళ సిద్దాంతం, ఆంధ్ర సిద్ధాంతం


14 ఇక్ష్వాకుల శాసనాల ప్రకారం నలుగురు పాలకులు ఉండగా,

పురాణాల ప్రకారం ఎంతమంది పాలకులు వున్నారు?

Ans-ఏడుగురు

15.శ్రీశాంతమూలుడి తూర్పు సరిహద్దు బంగాళాఖాతం కాగా

వాయువ్య, నైరుతి సరిహద్దులు ఏవి? 

Ans-అభీరులు, బనవాసి


16. శ్రీశాంతమూలుడు ఏ శాసనాలలో తన కుటుంబీకుల గురించి

పేర్కొన్నాడు?

Ans- రెంటాల, దాచేపల్లి, కేశనపల్లి


17.శతసహస్రహాలక, మహాదానాపతి అని ఎవరిని పేర్కొంటారు?

-శ్రీశాంతమూలుడు


18. దక్షిణాది అశోకుడిగా పేరుగాంచిన వీరపురుషదత్తుడు ఎవరి

ప్రోత్సాహంతో బౌద్ధమతాన్ని స్వీకరించాడు?

-శాంతశ్రీ, బాపిశ్రీ, షష్టిశ్రీ


19. వీరపురుషదత్తుడి కాలంలో ఏ మహిళ బౌద్ధమత వ్యాప్తి

కోసం తీవ్ర కృషి చేసింది?

ఉపాశిక బోధిశ్రీ

20. ఉపాశిక బోధిశ్రీ శాసనం ప్రకారం బౌద్ధమత వ్యాప్తి కొరకు

బౌద్ధ సన్యాసులు ఏ ప్రాంతాలకు వెళ్లారు?


Ans:- శ్రీలంక, కాశ్మీర్, టిబెట్


21. ఉపాశిక బోధిశ్రీ పాపిల వద్ద విహారాలను, పుష్పగిరి వద్ద

శిలామండపాలను నిర్మించగా ఏ కొండపై బౌద్ధ విహరం,

చైత్యాన్ని నిర్మించింది?

Ans- చూలదర్శగిరి కొండ


22. వీరపురుషదత్తుడు వేయించిన శాసనాలు ఏవి?

        Ans - అల్లూరి, 

            ఉప్పుగుండూరు,

            నాగార్జున కొండ, 

            అమరావతి,

            జగ్గయ్యపేట శాసనాలు


23.  ఎహువల శాంతమూలుడి కాలం నుండి సంస్కృతంలో

శాసనాలు రాసే సాంప్రదాయం ప్రారంభంకాగా ఇతను ఏ

ప్రాంతంలో శాసనాన్ని వేయించాడు? 

Ans - నాగార్జున కొండ


24. ఇటీవల గుమ్మడూరు వద్ద లభ్యమయిన శాసనం ఎవరిది?

Ans - ఎహువల శాంతమూలుడు / 2వ శాంతమూలుడు


25. ఇక్ష్వాక రాజ్యంపై పల్లవులు చేసిన దాడి గురించి ఏ శాసనం

పేర్కొంటుంది?

Ans- మంచికల్లు శాసనం(ఆంధ్ర దేశంలో తొలి పల్లవ శాసనం) 


26.ఇక్ష్వాక చివరి రాజు రుద్రపురుషదత్తుడు కాగా ఇక్ష్వాకులు

అంతం గురించి ఏ శాసనం పేర్కొంటుంది?

Ans - శివస్కందవర్మ యొక్క మైదవోలు శాసనం


27. ఇక్ష్వాకుల కాలం నాటి అమరావతి శిల్పకళ ఏఏ ప్రాంతాలకు

వ్యాప్తి చెందింది?

Ans - నాగార్జున కొండ, అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు


28. శాసనాలపై సంవత్సరాలు, నిర్మాణాలపై శిల్పుల పేర్లు,

మేనత్తల కుమార్తెలను వివాహమ కే సాంప్రదాయాలు ఎవరి

కాలం నుండి ప్రారంభమయ్యాయి?

Ans - ఇక్ష్వాకులు


29. అమరావతి శిల్పకళకు చెందిన మందతా శిల్పం

జగ్గయ్యపేటలో లభించగా నాగార్జున కొండ వద్ద నిర్మించిన

ప్రఖ్యాత నిర్మాణం ఏది?

Ans - ధ్వని విజ్ఞాన కేంద్రం లేదా ప్రేక్షాగారం


30. శ్రీలంక బౌద్ధ సన్యాసులు గురించి నాగార్జున కొండ వద్ద

నిర్మించిన విహారము ఏది?

Ans - సింహళ విహారము


31. ఇక్ష్వాకుల కాలంలో వీరుల విగ్రహాలను ప్రతిష్టించడాన్ని

ఏమంటారు?

 Ans - విరుగల్


32. ఏ ప్రాంతం వద్ద లభించిన శిల్పంలో వీరపురుషదత్తుడు

శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్లు చూపబడింది?

Ans - నాగార్జున కొండ




No comments

Powered by Blogger.